ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 2:05 PM ISTధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
ధ్వంసమైన ఏపీ బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాధారణ పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం, తలసరి ఆదాయం పెంచడమే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట గ్లోబల్లీ అనేది తమ నినాదమని సీఎం చంద్రబాబు చెప్పారు.మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలని, సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సీఎం. ప్రపంచ వ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారని, 2047 నాటికి అత్యంత ప్రభావితమైన వ్యక్తులుగా తెలుగు వారుంటారని సీఎం చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు.
దావోస్‌లో ఎన్ని ఎంవోయూలు చేసుకున్నారంటూ వస్తున్న ప్రశ్నలపై ఆయన సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయన్న ఆయన, అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుందని చెప్పారు. రామాయపట్నంలో రూ.95 వేల కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఎల్‌జీ కంపెనీ రూ.5 వేల కోట్లు, రూ. 65 వేల కోట్లతో రిలయన్స్ బయో ఫ్యూయల్ ప్లాంట్ రాబోతున్నట్లు ప్రకటించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు గూగుల్ రాక ఏపీకి ఒక గేమ్ ఛేంజర్ అని అన్నారు. విశాఖలో ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు.