మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ మంత్రి రోజా మరో వివాదంలో ఇరుక్కున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై

By Medi Samrat
Published on : 18 Oct 2023 8:30 PM IST

మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ మంత్రి రోజా మరో వివాదంలో ఇరుక్కున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బుడబుక్కల సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రోజా వ్యాఖ్యలు తమ కులస్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడిన రోజాపై కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తక్షణమే తమకు రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ బుడబుక్కల వాళ్లంటూ వ్యాఖ్యలు చేశారు. తమ కులాన్ని కించపరిచే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ ఆ సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కులాన్ని కించపరిచిన రోజా బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి రోజా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌‌లను విమర్శించే క్రమంలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను విమర్శిస్తూ ఇద్దర్ని బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story