ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు.

By Medi Samrat  Published on  13 July 2024 12:15 PM GMT
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని పిలుపునిచ్చారు. కాదని, ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని అన్నారు. అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడున్న ప్రజలు వినతి పత్రాలు ఇస్తూ ఆయన కాళ్ల మీద పడ్డారు. దీంతో సీఎం చంద్రబాబు కాళ్లకు దండం పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి విడనాడాలి. తల్లిదండ్రులు, గురువులు, దేవుళ్ల కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి. ఈ రోజు నుంచి ఎవరు అలా చేయకండి. ఈ దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా.." అని అన్నారు. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలని.. కానీ రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు చంద్రబాబు.

Next Story