పార్టీ కార్యక్రమం కోసమే పర్మిషన్‌ తీసుకున్నారు : పేర్ని నాని

Perni Nani Fire On Chandrababu. సంక్రాంతి కానుక పేరుతో భారీగా జనాల్ని తరలించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

By Medi Samrat  Published on  2 Jan 2023 7:35 PM IST
పార్టీ కార్యక్రమం కోసమే పర్మిషన్‌ తీసుకున్నారు : పేర్ని నాని

సంక్రాంతి కానుక పేరుతో భారీగా జనాల్ని తరలించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గుంటూరు ఘటన జరగగానే ఎల్లో మీడియా ప్లేట్ ఫిరాయించిందని.. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా ఎన్నో అకృత్యాలు చేసిందని విమ‌ర్శించారు. ఘటనతో చంద్రబాబుకు సంబంధంలేదంటూ ప్రచారం చేశార‌ని.. ఘటన తరువాత చంద్రబాబు దిక్కుమాలిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని.. తప్పును ఎన్‌ఆర్‌ఐ సంస్థపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేశార‌ని.. చంద్రబాబుకు తప్పు అంటకుండా ఎల్లో మీడియా వార్తలు, రాతలు ఉన్నార‌ని అన్నారు.

గుంటూరులో జరిగిన కార్యక్రమం పూర్తిగా టీడీపీ కార్యక్రమం తొక్కిసలాట జరగగానే.. తమకు సంబంధం లేదంటారని ఫైర‌య్యారు. పార్టీ కార్యక్రమం కోసమే పర్మిషన్‌ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్న వారంతా టీడీపీ నేతలేన‌ని అన్నారు. 30 వేల మందికి స్లిప్‌లు పంచిపెట్టారు.. 10వేల మందితో సభ అంటూ పర్మిషన్ తీసుకున్నారు.. తప్పు ఎవరిదో ఇక్కడే తెలుస్తోందని.. మనుషుల ప్రాణాలు పోయిన తరువాత మాటలు మారుస్తున్నారని మండిప‌డ్డారు.


చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారని ఫైర‌య్యారు. జన సమీకరణ ఉయ్యూరు ట్రస్ట్ చేసిందా..? టీడీపీ నేతలు చేశారా..? అని ప్ర‌శ్నించారు. టీడీపీ పేరు చెబితే ప్రజలు రావడం లేదని.. అమెరికా నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి.. టోకెన్లు పంచి.. జనాలను తెప్పించుకోవాలని చూస్తున్నారా..? అని నిల‌దీశారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో తప్పుడు రాజకీయం చేస్తున్నార‌ని.. రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస క్రీడ ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.

2014 నుంచి చంద్రబాబుకు డ్రోన్‌ జబ్బు వదల్లేదని విమ‌ర్శించారు. ఇరుకు సందుల్లోకి జనాల్నితరలించి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ప్రజలను ఆకర్షించే శక్తి లోకేష్‌కు లేదని అన్నారు. చంద్రబాబుపై ఆయన కొడుకుకు నమ్మకం లేదు.. లోకేష్‌పై చంద్రబాబుకు నమ్మకం లేదు.. చంద్రబాబు ఫొటో లేకుండా లోకేష్ పాదయాత్ర పోస్టర్ ఉంద‌ని.. చంద్రబాబు బతికి ఉండగానే.. ఎన్టీఆర్‌ ఆత్మ కసి తీర్చుకుంటుందని తీవ్ర‌విమ‌ర్శ‌లు చేశారు. వావి వరసలు లేకుండా కలిసిపోయి.. జగన్ పై యుద్దం చేయడానికి సిద్ధమవుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. దత్తపుత్రుడు బీజేపీతో ఉంటూ.. చంద్రబాబుకు సైగ చేస్తున్నాడని ఆరోపించారు. రాజకీయంగా ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌ను ఢీ కొట్టలేరని అన్నారు. వారాంతంలో ఓ అడ్డ గాడిద వచ్చి జగన్‌ ని తిట్టి వెళ్తుందని ఫైర్ అయ్యారు.




Next Story