పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది.
By Medi Samrat
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణానికి పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉంది. హైదరాబాద్ లోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి భద్రాచలంలో బస చేసి, స్వామి వారి కళ్యాణానికి హాజరై ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాములకి సమర్పించాల్సి ఉంది. అయితే పవన్ పర్యటన రద్దు అయినట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం భద్రాచలంలో శ్రీ సీతారామ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఆలయంలో ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.