ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సాగింది. కూటమి పార్టీల్లోని కష్టపడి పనిచేసే నేతలకు మిగిలి ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన వివరాలను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు. కేంద్రమంత్రులతో భేటీ వివరాలను సీఎంతో పంచుకున్నారు. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి, మరో విడత నామినేటెడ్ పోస్టుల నియామకం గురించి కూడా చర్చించారు.