రేపు పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది ఇలా..

Pawan Kalyan will visit East Godavari district tomorrow. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

By Medi Samrat  Published on  9 May 2023 4:30 PM IST
రేపు పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది ఇలా..

Pawan Kalyan will visit East Godavari district tomorrow


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను కలుసుకోనున్నారు. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. పవన్ పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ పర్యటనలో పవన్ తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారు.

వకీల్ సాబ్ సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చిన పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో జనసేన ప్రయాణం సాగుతూ ఉండగా.. త్వరలో టీడీపీతో కలిసి పోరాడే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.


Next Story