అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ఇవ్వాలి : పవన్

Janasena Chief Pawan Kalyan Demands Bharat Ratna to Alluri Sitarama Raju. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి నేడు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు

By M.S.R  Published on  7 May 2023 1:45 PM GMT
అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ఇవ్వాలి : పవన్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి నేడు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరికొత్త డిమాండ్ తో ముందుకు వచ్చారు. వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదని, వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందని పవన్ తెలిపారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని.. అటువంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అని వెల్లడించారు. ఆ మహా యోధుడు వీరమరణం పొంది నేటికి వందేళ్లు అని పవన్ తెలిపారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకు భయపడని నైజం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఆయన స్ఫూర్తిని దేశమంతటా చాటాలని విజ్ఞప్తి చేశారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను తామే స్వీకరిస్తామని పవన్ స్పష్టం చేశారు.


Next Story