సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు
By Medi Samrat
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లాకు రానున్నారు. జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. గురువారం రాత్రి సరిహద్దు వెంట పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మురళీ నాయక్ మృతిచెందారు. సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం రానున్నారు. ఉదయం 9:25కు కల్లి తాండాకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
ఇక సైన్యానికి మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సైన్యానికి నైతిక మద్దతు అందించేలా షష్ట షణ్ముక క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ మీద భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రతి ఒక్కరి నైతిక మద్దతు అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శత్రుమూకలపై పోరాడుతున్న సైన్యానికి. ప్రధాని మోదీకి దైవ బలం, ఆశీస్సులు ఉండేలా దేవుణ్ని ప్రార్థించాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.