ప్రధాని మోదీని కీర్తిస్తూ.. పవన్ కల్యాణ్ ట్విటర్ పోస్ట్‌లు
Pawan Kalyan showered praises on Prime Minister Modi. ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ ట్విట్టర్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోస్ట్‌లు పెట్టారు. ''క్లిష్ట సమయంలో
By అంజి Published on 14 Nov 2022 8:06 AM GMTప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ ట్విట్టర్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోస్ట్‌లు పెట్టారు. ''క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని ఆదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారని, ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారని'' అన్నారు. ''ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ - శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దంపడతాయి'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
'ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ'- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయి. @narendramodi @PMOIndia pic.twitter.com/D3sf7SMaKQ
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో ఇద్దరు మహిళలపై కంకరమట్టి పోసిన ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. దానికి సంబంధించిన వీడియోను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాకు, అరాచకాలకు ఈ వీడియో నిదర్శనం అంటూ పవన్ ట్వీట్ చేశారు. ''హరిపురంలో కొట్రు దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రిపై కంకరమట్టి పోశారు. ముసలామె 'నేను చచ్చిపోతున్నాను' అని రోధిస్తున్నా.. చచ్చిపో అని హెచ్చరించే ఓ కంఠంలోని కాఠిన్యానికి దన్నుగా నిలిచే వ్యవస్థ ఎవరిది?'' అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
YCP has institutionalized Lawlessness.The following Video is an example. pic.twitter.com/3hXe59ZXya
— Pawan Kalyan (@PawanKalyan) November 14, 2022