చంద్ర‌బాబు అరెస్ట్‌.. ప‌వ‌న్ రియాక్ష‌న్‌

చంద్ర‌బాబు అరెస్టుపై జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

By Medi Samrat  Published on  9 Sept 2023 12:45 PM IST
చంద్ర‌బాబు అరెస్ట్‌.. ప‌వ‌న్ రియాక్ష‌న్‌

చంద్ర‌బాబు అరెస్టుపై జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో ఏ తప్పూ చేయని జనసేన నాయకుల పై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారు. నేడు చంద్రబాబు అరెస్టు చేసిన తీరు ను సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందన్నారు. పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదన్నారు. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా, మీ పార్టీకి సంబంధం ఏమిటి అని ప్ర‌శ్నించారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వం కాదా అని ఫైర్ అయ్యారు. ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజం అన్నారు.

Next Story