విశాఖపట్నంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పందించారు. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలిపారు. తమ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టారని.. ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. ఇటువంటి ఆంక్షలే భవిష్యత్తులో విధించకుండా జగన్ ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయపోరాటం చేయబోతున్నట్లుగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వాళ్ల కోసం న్యాయపోరాటం చేస్తాం. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప పోలీసులపై కాదని స్పష్టత ఇచ్చారు. 115 మందికి పైగా అటెంటివ్ మర్డర్ కేస్ పెట్టారని.. నాయనిపుణులతో చర్చించి కొంతమందికి స్టేషన్ బైల్ ఇప్పించగలిగామన్నారు. మంగళగిరికి బయలుదేరిన ఆయనకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. హోటల్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరిన సమయంలో అభిమానులు తాకిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.