నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు.

By Medi Samrat
Published on : 1 July 2025 3:18 PM IST

నటి పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. ఆమె ప‌రిస్థితి తెలిసిన వెంట‌నే పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేర‌కు మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆర్థిక‌సాయం మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.

పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు

Next Story