చంద్రబాబుతో పవన్ క‌ళ్యాణ్ భేటీ

టీడీపీ అధినేత‌ చంద్రబాబుతో జ‌న‌సేనాని పవన్ క‌ళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు పవన్ ను భోజ‌నానికి ఆహ్వానించ‌గా..

By Medi Samrat
Published on : 13 Jan 2024 8:11 PM IST

చంద్రబాబుతో పవన్ క‌ళ్యాణ్ భేటీ

టీడీపీ అధినేత‌ చంద్రబాబుతో జ‌న‌సేనాని పవన్ క‌ళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు పవన్ ను భోజ‌నానికి ఆహ్వానించ‌గా.. పవన్ కొద్దిసేప‌టి క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు జ‌న‌సేన నేత‌ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ భేటీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తుంది

ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి కాగా.. టీడీపీ, జనసేన పార్టీల్లోకి పలువురు నేతలు చేరుతుండడం, వారికి సీట్ల కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. రేపు మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోలను కాల్చేయనున్నట్లు స‌మాచారం.

చంద్రబాబు ఉండవల్లి నివాసానికి పవన్ కల్యాణ్ రావడం ఇదే తొలిసారి. కాగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకోనున్నాయి. కాగా, ఇప్పటికే పలు దశల్లో వైసీపీ తమ అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చింది. జనసేన ఈ సంక్రాంతి రోజున తొలి దశలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జనసేన కూడా త్వరలోనే తమ అభ్యర్థులను ఖరారు చేయనుంది.

Next Story