చంద్రబాబును క‌లిసిన‌ పవన్‌ కల్యాణ్‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

Pawan Kalyan meets Chandrababu Naidu in Hyderabad. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ‌ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

By Medi Samrat
Published on : 29 April 2023 7:54 PM IST

చంద్రబాబును క‌లిసిన‌ పవన్‌ కల్యాణ్‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌

Pawan Kalyan meets Chandrababu Naidu in Hyderabad


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు సమీపిస్తున్న వేళ‌ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య స్నేహ‌బంధం కొనసాగుతుంది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుతో జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ క‌ళ్యాణ్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై చర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ భేటీ అవ్వడం మూడ‌వ‌ సారి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడే అంశంపై ఇరువురు నేత‌లు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. చంద్రబాబుతో పవన్ క‌ళ్యాణ్‌ భేటీ అవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





Next Story