చంద్రబాబును పరామర్శించిన జనసేనాని

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు

By Medi Samrat
Published on : 4 Nov 2023 3:45 PM IST

చంద్రబాబును పరామర్శించిన జనసేనాని

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడుహైదరాబాదులో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబును పరామర్శించిన అనంతరం, పలు అంశాలపై కీలక చర్చ జరిపారు. 10 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించే అంశంపైనా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగింది.

పొత్తు నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపకల్పన విషయం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. టీడీపీ-జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపైనా ఇరువురు మాట్లాడుకున్నారు.

Next Story