ఢిల్లీ మీడియా అడిగింద‌ని సీఎంకు చెబుతా : పవన్ కళ్యాణ్

జల్ జీవన్ మిషన్ బడ్జెట్ పెంచాలని, కాలవ్యవథి కూడా పెంచాలని కోరానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.

By Medi Samrat  Published on  26 Nov 2024 3:29 PM IST
ఢిల్లీ మీడియా అడిగింద‌ని సీఎంకు చెబుతా : పవన్ కళ్యాణ్

జల్ జీవన్ మిషన్ బడ్జెట్ పెంచాలని, కాలవ్యవథి కూడా పెంచాలని కోరానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను వాడలేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నిధులు వినియోగించలేదు. గత ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందన్నారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఈరోజు కలుస్తాను. రేపు ప్రధానిని కలుస్తాను అని తెలిపారు.

రాష్ట్రంలో పైప్ లైన్లు వేయడంలో డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయన్నారు. ఇళ్ళల్లో మోటార్ పెట్టి నీరు లాగేస్తున్నారు. ఎత్తు మీద ఉన్నవారికి నీరు అందడం లేదు.. ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఉపరితల జలవనరులు ఉన్నాయి.. కానీ డిజైనింగ్ లోపాల కారణంగా నీరు అందరికీ అందడం లేదు.. రూరల్ వాటర్ సప్లై శాఖ కూడా కొంత బాధ్యత వహించాలన్నారు

అదానీ వ్యవహారంపై ముఖ్యమంత్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. సమోసాల కోసమే రూ.9 కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వంలో అసలు బాధ్యత లేదు.. పారదర్శక లేదు.. జవాబుదారీతనం అసలే లేదన్నారు.

పోలీసుల పని పోలీసులను చేసుకొనివ్వండి.. నా పని నేను చేస్తానన్నారు. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేదు. మీరు అడగాల్సిందే ముఖ్యమంత్రిని అన్నారు. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలి.. మీరు చెప్పిన అన్ని అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా అడిగారని సీఎంకి చెబుతాన‌న్నారు.

Next Story