ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ తదితరులు పవిత్ర స్నానాలు చేశారు. పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చొక్కా పూర్తిగా తీసేసి, కేవలం ధోతీపై నీళ్లలో మునిగారు.
పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా దక్షిణ భారతదేశంలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కుంభమేళాలో స్నానాన్ని ఆచరించారు. ఇప్పటికే కుంభమేళాలో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే కుంభమేళాను పొడిగించాలనే డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. అయితే దీనిపై యూపీ ప్రభుత్వం నుంది ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.