రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు. విశ్రాంతి అవసరమని సూచించారు. జ్వరంతో ఇబ్బందిపడుతూనే శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు.