పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చింతలపూడిలో ఆర్థికసాయం అందజేశారు. పవన్ పర్యటన కారణంగా భారీగా జనసందోహం తరలివచ్చింది. పోలీసులకు వారిని అదుపు చేయడం చాలా కష్టమైపోయింది. పవన్ రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతుండగా, రోప్ పార్టీ పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాట కారణంగా ఓ పోలీసు అధికారి రోడ్డు పక్కకు పడిపోయారు. వెంటనే స్పందించిన జనసేనాని ఆ పోలీసు అధికారిని చేయిపట్టుకుని పైకిలేపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కౌలు రైతుల సమస్యల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్. కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటే మేం రోడ్డుపైకి వచ్చేవారం కాదన్నారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పొన ఆర్థిక సాయం అందజేశారు. కైలు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నిస్తే నన్ను దత్తపుత్రుడు అంటారా? అని విమర్శించారు పవన్. ముఖ్యమంత్రి కాబట్టి మీరు అనే మాట్లాడుతున్నా..ఇంకోసారి దత్తపుత్రుడు అని అంటే.. సీబీఐకి దత్తపుత్రుడని అంటామని తెలిపారు. నేనెవ్వరికీ దత్తత వెళ్లను.. నన్నెవరూ భరించలేరని చెప్పారు. 99 సార్లు శాంతియుతంగా ప్రవర్తిస్తానని, అలాగే విర్రవీగితే తాను ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలుసన్నారు.