మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ

Pawan Kalyan Fans Protest Against Ministers. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రమంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు గుడివాడలో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్

By Medi Samrat
Published on : 25 Feb 2022 12:58 PM IST

మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ

కృష్ణా : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రమంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు గుడివాడలో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ త‌గిలింది. గుడివాడలో జి-3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పాల్గొన్నారు. ప్రారంభ చిత్రంగా థియేటర్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే విధంగా యాజ‌మాన్యం ఏర్పాట్లు చేసింది. అయితే.. థియేటర్ వద్ద మంత్రి పేర్ని నానిని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్దఎత్తున అభిమానులు నినాదాలు చేశారు.

సీఎం డౌన్ డౌన్ అంటూ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేఫ‌థ్యంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమని అభిమానులు అంటున్నారు. ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయమ‌ని జనసేన పార్టీ శ్రేణులు అంటున్నాయి.


Next Story