చిన్నాన్నని ఎవరు హత్య చేసారమ్మా అంటే.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారు

Pawan Kalyan Comments On YSRCP Leaders. పవన్, వైసీపీ నాయకులకు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. అమ‌రావ‌తిలో

By Medi Samrat  Published on  29 Sept 2021 4:39 PM IST
చిన్నాన్నని ఎవరు హత్య చేసారమ్మా అంటే.. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అంటున్నారు

పవన్, వైసీపీ నాయకులకు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన పార్టీ విస్తృత శ్రేణి స‌మావేశంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాన్ మాట్లాడుతూ మ‌రొమారు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులకు డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయి.. ఒక్క భయం తప్ప.. చూపిస్తాను ఖచ్చితంగా భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. ఈ సన్నాసులకు వారి తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం మనం నేర్పలేమ‌ని.. 16 ఏళ్ల నూనూగు మీసాల కుర్రాళ్ళు వీరికి సంస్కారం నేర్పించగలరని అన్నారు.

బూతులు మాట్లాడాలి అనుకుంటే నేను మీకంటే బాగా మాట్లాడతానని.. నాలుగు భాషల్లో మీకంటే ఎక్కువ మాట్లాడగలనని మండిప‌డ్డారు. నేను పద్దతిగా, సంస్కారవంతంగా ఉంటే వైసీపీ వారికి నచ్చట్లేదని.. వైసీపీ నేతలలాగ నేను మాట్లాడలేక కాదు.. నాకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారని అని అన్నారు. జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసారమ్మా అంటే.. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని వైసీపీ నేతలు అంటున్నారని ప‌వ‌న్ ఫైర్ అయ్యారు.


Next Story