దారుణం : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ తల్లిదండ్రులు

Parents Try To Kill Own Daughter. క‌డ‌ప జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు

By Medi Samrat
Published on : 16 Jun 2021 1:12 PM IST

దారుణం : కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ తల్లిదండ్రులు

క‌డ‌ప జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ప్రేమ వ్యవహారం ఆ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

రాయచోటి సీఐ జి. రాజు కథనం మేరకు.. బాధిత‌ యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. ఈ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు యువ‌తికి మరో సంబంధo చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ యువ‌తి చెడగొడుతోంది. దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో యువ‌తికి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా.. యువ‌తి నిరాకరించింది. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది.

దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు యువ‌తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆ యువ‌తిని కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




Next Story