ఆడ, మగ కలవడం సృష్టి ధర్మం.. కానీ కొందరు సృష్టికి విరుద్ధంగా కలుస్తుంటారు. తాజాగా మైదుకూరులో జరిగిన ఓ ఘటన సృష్టికి విరుద్ధంగా తలపిస్తోంది. అతడే కావాలంటూ ఓ యువకుడు మైదుకూరులో హల్‌చల్ చేశాడు. అతడిని, నన్ను కలిపి తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయి కుమార్ అనే యువకుడు ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే టిక్‌టాక్ ద్వారా అతడికి మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మైదుకూరు యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరం సెల్‌ఫోన్‌లో పరస్పరం మాట్లాడుకున్నామని సాయికుమార్ చెప్పారు.
నువ్వు లేకపోతే నేను బతకలేను, నీవంటే నాకు చాలా ఇష్టమని చెప్పి లేని పోని భరోసా ఇచ్చాడని, ఆ తర్వాత దుబాయ్ నుంచి మస్కట్‌కు వచ్చేలా చేశాడని తెలిపారు. అక్కడే పెళ్లి చేసుకున్నారని.. విదేశాల నుండి వచ్చాక తనకు దురమయ్యాడని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ బయట ఆత్మహత్యకు ప్రయత్నించగా యువకుడి బంధువులే చికిత్స చేయించారని పేర్కొన్నారు. యువకుడు తనతో ఓ రకంగా, తల్లిదండ్రుల వద్ద మరో రకంగా మాట్లాడుతున్నారని.. అతను లేకపోతే తాను బతకలేనని సాయి కుమార్ చెప్పారు. తమను ఎలాగైన ఒకటి చేయాలని వేడుకున్నారు.