జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ పాలనలోని అవినీతి లెక్కలు అన్నీ బయటకు తీస్తాం

Nagababu Fire On YSRCP Govt. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ-వైసీపీ మధ్య తీవ్ర వాదోపవాదనలు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  15 Nov 2022 7:00 PM IST
జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ పాలనలోని అవినీతి లెక్కలు అన్నీ బయటకు తీస్తాం
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ-వైసీపీ మధ్య తీవ్ర వాదోపవాదనలు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ వీలైనంత వేగంగా సమయం దొరికినప్పుడల్లా ఏపీలో సమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య నాగబాబు సోషల్ మీడియా వేదికగా వైసీపీపై సెటైర్లు వేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏపీ మంత్రులకు అంత భయం ఎందుకని నాగబాబు ప్రశ్నించారు. పూర్తి పరిజ్ఞానం లేని ఏపీ మంత్రులకు స్క్రిప్టు అందించినట్లే అందరికీ అందిస్తారని భ్రమ పడుతున్నట్లుందని విమర్శించారు. పవన్ ఏది మాట్లాడినా పదిసార్లు ఆలోచించి మాట్లాడతారని.. వైసీపీ నేతలు మాత్రం పాలన గాలికొదిలేసి పవన్ ప్రధాని మోదీతో ఏం మాట్లాడారోనని ఆవేదన చెందుతున్నారని అన్నారు నాగబాబు. జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ పాలనలోని అవినీతి లెక్కలు అన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు. ప్రధాన మంత్రి మోదీ.. పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతో ఆహ్వానించి మర్యాదపూర్వకంగా మాట్లాడారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన జగన్న కాలనీ పథకం అవినీతి మయమని నాగబాబు ఆరోపించారు.


Next Story