ఎంపీ రఘురామకు ఊహించని షాక్.. ఆ లిస్టులోనే లేరంట..!

MP Raghu Ramakrishna Raju not in PM Modi welcoming list. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండే

By Medi Samrat  Published on  4 July 2022 9:49 AM IST
ఎంపీ రఘురామకు ఊహించని షాక్.. ఆ లిస్టులోనే లేరంట..!

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండే వారి జాబితాలో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో కానీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు పేర్కొన్నారు. ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తెలియదని, తాము మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. రఘురామరాజు ఫోన్ నంబరును పోలీసులు బ్లాక్ లిస్టులో పెట్టలేదని అన్నారు.

ప్రధాని పర్యటనలో పాల్గొంటానని చెబుతూ వస్తున్న నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏపీకి రాకుండానే వెళ్లిపోయారు. మోదీ పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రఘురామరాజు భీమవరం వెళ్లేందుకు గతరాత్రి హైదరాబాద్‌లో రైలెక్కారు. ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారని.. యువకుల కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రఘురామ కృష్ణంరాజు మధ్యలోనే రైలు దిగి వెళ్లిపోయారు. ప్రొటోకాల్ విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.









Next Story