సీఎం చంద్రబాబు ముందుచూపు రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడపిస్తుంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాయన శేఖర్ బాబు రచించిన ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్టు సృష్టించిన నారా చంద్రబాబు నాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజనరీ లీడర్ సీఎంచంద్రబాబుపై పుస్తకం రచించిన రచయిత భాయన శేఖర్ బాబుకి అభినందనలు తెలుపుతూ సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఆదర్శవంతులుగా వున్న నాయకుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒకరని తెలిపారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పనికి ఆహార పథకం, డ్వాక్రా సంఘాలు వంటి వాటిని ఎన్నో పథకాలను ఆదర్శంగా తీసుకుని అమలు చేయటం సీఎ చంద్రబాబు నాయుడు విజన్ కి నిదర్శనమన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలిపారు. విజయవాడ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా అభివృద్ది చేసేందుకు పూర్తి మద్దతు ఇచ్చారని ప్రకటించారు.