అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంటాం

Mopidevi Venkatramana assured govt. support to Kin of Amarnath killed in Bapatla. విద్యార్థి అమర్నాథ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని

By Medi Samrat
Published on : 17 Jun 2023 4:33 PM IST

అమర్నాథ్ కుటుంబాన్ని ఆదుకుంటాం

Mopidevi Venkatramana


విద్యార్థి అమర్నాథ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని, దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్‌ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని అమర్నాథ్‌ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ట్యూషన్ కు వెళ్లొస్తున్న పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెడ్లపాలెం వద్ద వెంకటేశ్వరరెడ్డి, మరికొందరు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అరుపులు, కేకలు పెట్టాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెట్రోలు దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వెంకటేశ్వర్‌రెడ్డి పేరును చెప్పాడు. బాలుడు పేర్కొన్న వెంకటేశ్వర్‌రెడ్డి.. బాధిత బాలుడు అమర్నాథ్‌రెడ్డి సోదరిని పలుమార్లు వేధించాడని విచారణలో తెలిసింది. విషయం తెలిసిన అమర్నాథ్ రెండు నెలల క్రితం వెంకటేశ్వర్‌రెడ్డిని నిలదీశాడు. ఇంకోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి స్నేహితులతో కలిసి రెండుసార్లు బాలుడిపై దాడిచేశాడు. తనపై దాడి విషయాన్ని అమర్నాథ్ వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అమర్నాథ్‌పై మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సైకిలుపై ట్యూషన్ నుంచి వస్తున్న బాలుడిని అడ్డగించి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టాడు.


Next Story