వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న.. ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

MLA roja technical problem on a passing plane. చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని దారి మళ్లీంచారు

By అంజి
Published on : 14 Dec 2021 1:53 PM IST

వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న.. ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని దారి మళ్లీంచారు. విమానంలో నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో రాజమహేంద్రవరం - తిరుపతి ఇండిగో విమానాన్ని ఎయిర్‌లైన్స్‌ అధికారులు దారి మళ్లీంచారు. దాదాపు 60 నిమిషాల పాటు సాంకేతిక సమస్యతో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. రేణిగుంటకు రావాల్సిన విమానాన్ని కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

ఇండిగో విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా పైలట్‌ సురక్షితంగా విమానాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ విమానంలో నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, టీడీపీ సీనియర్ నేతలు యనమల, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు. బెంగళూరులో దిగిన ప్రయాణికులు.. అక్కడి నుండి తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడానికి గల కారణాలపై అధికారులు విశ్లేషిస్తున్నారు.

Next Story