చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడడానికి కారణం అదే.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే!! అయితే ఈ కులగణన ఎన్నికల ముందు అవసరమా అని కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కులగణనను తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుందన్నారు.
రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు మంత్రి వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదని.. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాంమని మంత్రి వేణు తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.