ప్యాకేజీ పెంచుకోవడం కోసమే జనసేన ఆవిర్భావ సభ : మంత్రి వెల్లంప‌ల్లి

Minister Vellampalli Srinivas About Janasena Meeting. జ‌న‌సేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్‌పై మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు ఘాటువ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat  Published on  14 March 2022 12:48 PM IST
ప్యాకేజీ పెంచుకోవడం కోసమే జనసేన ఆవిర్భావ సభ : మంత్రి వెల్లంప‌ల్లి

జ‌న‌సేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్‌పై మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు ఘాటువ్యాఖ్య‌లు చేశారు. ఐపీల్ క్రీడాకారుల వేలంపాట మాదిరిగా పవన్ కళ్యాణ్.. తన ప్యాకేజీ పెంచుకోవడం కోసమే జనసేన ఆవిర్భావ సభా నిర్వ‌హిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల‌ ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగంలేదన్నారు. తన ప్యాకేజీ పెంచుకోవడం కోసం ఏడాదికి ఒకటి రెండు సార్లు ఏపీకి వచ్చే పవన్‌కు ప్రజల తరుపున మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. విజ‌య‌వాడ‌లోని స్థానిక 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీలో నిర్మాణం పూర్తైన‌ ప‌లు అబివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నగరపాలక సంస్థలో కార్పోరేటర్లు గెలిచి నేటికీ ఏడాది కాలం అవుతుందని.. వారంద‌రూ ఈ ఏడాది కాలంలో త‌మ‌త‌మ డివిజన్లలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో వున్న ఈ కుండల బజారు రోడ్డును నేడు మేము అభివృద్ధి పరిచామన్నారు. టీడీపీ హయాంలో వెయ్యలేని రోడ్డును.. నేడు మేము వేసి ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హాల్ కూడా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో వుంద‌ని.. దానిని కూడా మేము నిర్మించి నేడు ప్రారంభించామన్నారు. అదే విధంగా వైయస్ఆర్ పార్కును కూడా నూతన హంగులతో అభివృద్ధి పరిచామన్నారు.











Next Story