చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రులు ఏమ‌న్నారంటే..

Minister Reacts On Chandrababu Pawan Meet. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుల భేటీపై మంత్రి రోజా స్పందించారు

By Medi Samrat  Published on  8 Jan 2023 9:15 PM IST
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రులు ఏమ‌న్నారంటే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుల భేటీపై మంత్రి రోజా స్పందించారు. విశాఖలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్‌ను పరామర్శిస్తాడని, అలాగే చంద్రబాబు వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోతే పవన్ వెళ్లి బాబును పరామర్శిస్తాడని విమర్శించారు. వీళ్ల దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీయే గొప్పదా అని రోజా ట్వీట్ చేశారు.

ఈ భేటీపై వైసీపీ నేతలు పలువురు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. గంగిరెద్దులు సంక్రాంతికి ఇంటింటికి తిరుగుతాయన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడని అంబటి రాంబాబు విమర్శించారు. సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి దగ్గరికి దత్తపుత్రుడు వెళ్లాడని ఏపీ మంత్రి అమర్నాద్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనని తాము ఎప్పటి నుండే చెబుతున్నామని ఏపీ మంత్రులు చెప్పారు. రాష్ట్రం కంటే వీళ్ల ప్రయోజనాలే ఈ ఇద్దరికి ముఖ్యమని.. రాష్ట్యాన్ని దోచుకోవడం, దాచుకోవడం కోసమే ఈ ఇద్దరి నేతల ప్రయత్నమని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టుగా చేస్తున్నాడనే పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటున్నామని చెప్పుకొచ్చారు.


Next Story