నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి పార్లమెంటు వేదిక కావడం పట్ల రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు.
ఈ చారిత్రక సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని, వారి శాంతియుత పోరాట ఫలితమని కొనియాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలయమైన అమరావతిని శాశ్వత రాజధానిగా నిలిపినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ‘జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి’ అంటూ లోకేష్ ఉద్వేగభరితంగా స్పందించారు.