దళితులపై దాడులు చేయడం చంద్రబాబు డీఎన్‌ఏలోనే ఉంది : మంత్రి మేరుగ నాగార్జున

Minister Meruga Nagarjuna Fire On Chandrababu. దళితులు అంటే చంద్రబాబుకు చిన్న చూపు.. అందుకే.. దళితులపై దాడులు చేయిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.

By Medi Samrat  Published on  22 April 2023 9:00 PM IST
దళితులపై దాడులు చేయడం చంద్రబాబు డీఎన్‌ఏలోనే ఉంది : మంత్రి మేరుగ నాగార్జున

Minister Meruga Nagarjuna


దళితులు అంటే చంద్రబాబుకు చిన్న చూపు.. అందుకే.. దళితులపై దాడులు చేయిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దళిత వ్యతిరేకి.. దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు అనలేదా..? అని ప్ర‌శ్నించారు. దళితులపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేయలేదా..? అని నిల‌దీశారు. దళితులపై దాడులు చేయడం చంద్రబాబు డీఎన్‌ఏలోనే ఉందని అన్నారు. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. 24, 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలడంతో చంద్రబాబుకు వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. దళితులను అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తామ‌న్నారు. దిక్కులేక తండ్రీకొడుకులు రోడ్డున పడ్డారని విమ‌ర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆదిమూలపు సురేష్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమ‌ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఖండించారు. ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌పై స్పష్టత ఇవ్వాల్సింది పోయి.. అంతుచూస్తానని చంద్రబాబు బెదిరించడం ఏంటీ..? అని ప్ర‌శ్నించారు. ఆదిమూలపు సురేష్‌కు భద్రత కల్పించాలని కోరారు. దళితులకు సీఎం జగన్‌ ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. అవినీతికి తావులేకుండా సీఎం జగన పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితులపై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలని అన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఘర్షణలు సృష్టించాలి అనుకోవడం సరికాదని అన్నారు.



Next Story