పవన్ క‌ళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్‌

Minister Jogi Ramesh Fire On Pawan Kalyan. ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసమే అక్రమాల కూల్చివేతలు జ‌రిగాయ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

By Medi Samrat
Published on : 5 Nov 2022 3:31 PM IST

పవన్ క‌ళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్‌

ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసమే అక్రమాల కూల్చివేతలు జ‌రిగాయ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. పవన్ క‌ళ్యాణ్ పనికిమాలిన పిచ్చి కూతలు కూస్తున్నాడని విమ‌ర్శించారు. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల గెలవలేని అసమర్ధుడు పవన్ క‌ళ్యాణ్ అని విమ‌ర్శించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడని ఫైర్ అయ్యారు.

పవన్ ఇంటి వద్ద రెక్కీ అంటూ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులే చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనికిమాలిన వ్యక్తులు.. మా ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరని అన్నారు. చంద్రబాబు హయాంలో వేల ఇళ్లను కూల్చేశారు.. వందల గుడులు కూల్చేశారు.. గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమ‌ర్శించారు. కళ్లుండి చూడలేని కబోది రామోజీ రావు.. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాస్తున్నార‌ని మండిప‌డ్డారు.


Next Story