మాపై దాడి చేస్తే.. ఆయ‌న‌ను పరామర్శించడం విడ్డూరంగా ఉంది

Minister Gudivada Amarnath Fire On Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చెప్పుతో కొడతానంటూ.. చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి కౌంటర్లు

By Medi Samrat
Published on : 18 Oct 2022 7:18 PM IST

మాపై దాడి చేస్తే.. ఆయ‌న‌ను పరామర్శించడం విడ్డూరంగా ఉంది

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చెప్పుతో కొడతానంటూ.. చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ జ‌న‌సేనాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం అంటే ఏమిటో తెలుసా నీకు? అని పవన్ ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గాజువాకలో, భీమవరంలో ప్రజలు ఇచ్చిన తీర్పు.. మిమ్మల్ని చెప్పుతో కొట్టడమేనని అన్నారు. పళ్లు రాలగొడతానన్న పవన్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. భీమవరంలో, గాజువాకలో ప్రజలు ఇచ్చిన తీర్పు మీ పళ్లు రాలగొట్టడమేనని తీవ్ర‌స్థాయిలో స్పందించారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పిన విశాఖ గర్జనను, విశాఖ రాజధాని కావాలన్న డిమాండ్ ను పక్కదారి పట్టించేందుకే పవన్ కల్యాణ్ కుటిల యత్నాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేనల మధ్య మ‌రోమారు పొత్తు కుదురుతుందని.. ఆ పొత్తును భార్యాభర్తల సంబంధంతో పోల్చారు. వైసీపీ నేతలపై జనసేన నేతలు దాడి చేస్తే.. చంద్రబాబు వెళ్లి ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పరామర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.


Next Story