అమరావతి: యూరియా సమస్య కేవలం ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నాం. 3 దఫాలకు కావాల్సిన యూరియాను రైతులు ఒకేసారి తీసుకుంటున్నారు. రబీకి కావాల్సిన యూరియాను కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి నడ్డాతో చంద్రబాబు మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి 50వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది..అని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడా యూరియా సమస్య లేదు.. వైసీపీ కావాలని రాజకీయం చేస్తోంది. రబీకి కేంద్రం 9.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఈ ఏడాది ఉల్లి దిగుబడి ఊహించని స్థాయిలో పెరిగింది. క్వింటాల్ ఉల్లిని రూ.1200లకు కొనుగోలు చేస్తున్నాం.ఇంత చేస్తున్నా.. వైసీపీ రాజకీయం చేస్తోంది..అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.