ఎప్పటికీ విజయం రాని పార్టీ 'జనసేన' : అంబటి రాంబాబు

Minister Ambati Rambabu Slams Pawan Kalyan. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

By Medi Samrat
Published on : 1 July 2023 2:31 PM IST

ఎప్పటికీ విజయం రాని పార్టీ జనసేన : అంబటి రాంబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నిన్న భీమవరం సభలో పవన్ కల్యాణ్ వీధి రౌడీలా మాట్లాడారని విమ‌ర్శించారు. పిచ్చి కుక్కలా స్వైర విహారం చేశారని మండిడ్డారు. పవన్ కల్యాణ్.. నా కొడకల్లారా అనే పదాన్ని ఉపయోగించార‌ని.. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతూ ఊగిపోవ‌డం పోరాట‌మా అని ప్ర‌శ్నించారు. పవన్ పాలిటిక్స్ కు పనికిరాడని.. రాజకీయాల్లో ఆయన ఒక చీడ పురుగు అని అన్నారు. పవన్ వైసీపీ నేతలను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టొచ్చు.. మేము మాత్రం ఏం మాట్లాడకుండా మా మూతులకు సైలెన్సర్లు పెట్టుకోవాలా అని ప్ర‌శ్నించారు. చెప్పు తీసి చూపించడం.. బూతులు మాట్లాడటమే పవన్ కల్యాణ్ పాలసీనా అని అంబటి నిలదీశారు.

ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని అంటున్న పవన్ క‌ళ్యాణ్‌.. అక్కడ ఎవరీ జెండా ఎగరేస్తాడో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకోవడమే పవన్ కల్యాణ్ లక్ష్యమని విమర్శలు గుప్పించారు. ఏపీలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ గెలవాలని అన్నారు. పవన్ కులాలను రెచ్చగొడుతున్నారని అంబటి విమర్శించారు. కాపులందరిని టీడీపీ అధినేత చంద్రబాబు చంకనెక్కించాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలనేదే పవన్ లక్ష్యమని, పెత్తందార్ల పల్లకిని పవన్ మోస్తున్నారని చెప్పారు.

జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందని.. ఇప్పటి వరకు విజయం లేని, ఎప్పటికీ విజయం రాని పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు. డబ్బు కోసం పవన్ నాటకాలు ఆడుతున్నారనే విషయాన్ని జనసైనికులు తెలుసుకోవాలని అన్నారు.


Next Story