టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. బీజేపీ కూడా వీరితో కలవనుంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలను వైసీపీ నేతలు విమర్శల కోసం బాగానే వాడేసుకుంటూ ఉన్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయని, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదని అన్నారాయన. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని.. ఏ పార్టీకి విశ్వాసం లేని వ్యక్తి నాపై పోటీకి దిగుతున్నాడన్నారు. ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్ పైనా పోటీ చేస్తున్నారు. పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు అంబటి. విశ్వాస ఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లి ప్రజలను కోరుతున్నానని మంత్రి అంబటి పిలుపునిచ్చారు. ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది. చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు. బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి.? రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారన్నారు.