అమరావతి అనేది అతిపెద్ద స్కామ్

Minister Ambati Rambabu Fire On Chandrababu. అమరావతి అనేది అతిపెద్ద స్కామ్ అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

By Medi Samrat
Published on : 14 Sept 2022 4:12 PM IST

అమరావతి అనేది అతిపెద్ద స్కామ్

అమరావతి అనేది అతిపెద్ద స్కామ్ అని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి స్కామ్‌కు పునాది వేసింది చంద్రబాబే అని అన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు పాదయాత్ర చేస్తున్నారని విమ‌ర్శించారు. పాదయాత్రలో ఒక్క రైతేనా ఉన్నారా..? అని ప్ర‌శ్నించారు. అసైన్డ్ భూముల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

పోల‌వ‌రం డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణం చంద్రబాబేన‌ని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు నిర్ణయాలతో పోలవరంలో వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు.. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలని అన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు.. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


Next Story