పవన్ కళ్యాణ్, లోకేశ్‌కు కనీసం నిబద్ధత లేదు: అంబటి రాంబాబు

Minister Ambati Rambabu Comments On Pawan Kalyan And Nara Lokesh. వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.

By Medi Samrat  Published on  15 Feb 2023 8:00 PM IST
పవన్ కళ్యాణ్, లోకేశ్‌కు కనీసం నిబద్ధత లేదు: అంబటి రాంబాబు

వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టబోయే వారాహియాత్ర గురించి మాట్లాడుతూ.. వారాహి ఏది.. ఎక్కడ.. ఆ సినిమా ఆపారా అంటూ మంత్రి అంబటి ప్రశ్నించారు. పవన్, లోకేశ్‌లకు కనీసం నిబద్ధత లేదని, రాజకీయాలపై కనీస అవగాహన లేని వ్యక్తులని విమర్శించారు. తెలుగు వాడుక భాషను లోకేశ్ మాట్లాడటం లేదని.. తెలుగు కూడా మాట్లాడలేని వారు టీడీపీ వారసులా అని ప్రశ్నించారు. ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందే తప్ప లబ్ధిపొందడం అనేది జరగదని విమర్శించారు. తాము వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమతౌల్యత కోసమే మూడు రాజధానులు అని.. మూడు రాజధానులతోనే పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమని అన్నారు.


Next Story