జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేదేంటి..?: మంత్రి కొడాలి నాని

Kodali nani says he wont listen to what junior ntr says. తాజా ఏపీ అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటని అన్నారు.

By అంజి  Published on  25 Nov 2021 8:34 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ చెబితే వినేదేంటి..?: మంత్రి కొడాలి నాని

తాజా ఏపీ అసెంబ్లీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మమ్మల్ని కంట్రోల్‌ చేయడమేంటని అన్నారు. ఆయన చెప్తే తాము ఎందుకు వింటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడారు. జూ.ఎన్టీఆర్‌ చెబితే తాను, వంశీ వింటామా, ఒకప్పుడు కలిసే ఉన్నామని, విభేదాలతో బయటకు వచ్చామన్నారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ కుటుంబం అంటే గౌరవం ఉందని, ఎన్టీఆర్‌ కుటుంబం ఇంకా నారా చంద్రబాబు నాయుడినే నమ్ముతోందని కొడాలి నాని వ్యాఖ్యనించారు.

ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మాటలు విని చాలా జాలేసిందంటూ మాట్లాడారు. తాను, వల్లభనేని వంశీ సెక్యూరిటీని వదిలేసి వస్తామని.. చంద్రబాబు కూడా సెక్యూరిటీ వదిలేసి రాగలరా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబితా తాము వింటామన్నారు. ఇక జూ.ఎన్టీఆర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం జగన్‌ను వేధించిన సోనియా గాంధీ నుండి చంద్రబాబు, లోకేష్‌ వరకు అందరూ సర్వనాశనమైపోయారని అన్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు మోసం చేయగలడని, ఒక్కరిని మాత్రం కాదని అన్నారు.

ఎన్టీఆర్‌ కూతురును రాజకీయంగా చంద్రబాబు వాడుకుంటున్నాడని, అతడితో ఎన్టీఆర్‌ అభిమానులు క్షమాపణలు చెప్పించాలన్నారు. భార్యను అడ్డంపెట్టుకుని నీతి మాలిన రాజకీయాలను చంద్రబాబు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక వర్ల రామయ్య జెడ్పీటీసీగా కూడా గెలవలేడని కొడాలి నాని రాజకీయ జోష్యం చెప్పారు. రచ్చ బండ కార్యక్రమానికి వెళ్తూ వైఎస్సార్‌ మరణించారని, ఆయన ప్రజా సేవే పరమావధిగా భావించారని పేర్కొన్నారు.

Next Story