చంద్రబాబు చరిత్ర బయట పెడతా : కొడాలి నాని సంచలన ప్రెస్ మీట్
Kodali Nani Fires On Chandrababu. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టమని మంత్రి కొడాలి నాని అన్నారు.
By Medi Samrat Published on 24 Jan 2022 8:04 PM ISTచంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టమని మంత్రి కొడాలి నాని అన్నారు. వారం రోజులుగా ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. చంద్రబాబు మతిమరుపు జబ్బుతో బాధ పడుతున్నాడని.. గుడివాడలో ఏదో జరిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఏదో చేద్దామని ఎల్లో మీడియా తాపత్రయమని.. కే కన్వెన్సన్ సెంటర్‌లో ఏదో జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆధారాలు అడిగితే చెత్త ఆధారాలు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2024 కాదు.. 2029, 2034 దాకా సమయం ఇస్తున్నానంటూ సవాల్ విసురుతూ.. చంద్రబాబు లాంటి న్యూసెన్స్ ఫెలోని రాజకీయ సమాధి చేయాలని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు పార్టీ ఓడిపోయిందని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో జూదశాలలు నడిచాయని ఆరోపించారు. 420 బ్యాచ్ చంద్రబాబు భజన చేయడం ఆపాలని.. రెండున్నరేళ్ల క్రితమే టీడీపీని ప్రజలు సమాధి చేశారని ఫైర్ అయ్యారు. బుద్ధా వెంకన్న కొబ్బరి చిప్పల బ్యాచ్.. జాగ్రత్తగా ఉండాలి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు.
420 బ్యాచ్, 420 ఛానళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని ఆరోపిస్తే.. కెమెరాలతో నిజనిర్ధారణ కమిటిని చంద్రబాబు ఇంట్లోకి అనుమతిస్తారా..? మంత్రులను మర్డర్ చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా..? అంటూ ప్రశ్నలు సంధించారు. ట్విట్టర్ బాబు.. పనికిమాలినోడు లోకేష్ గురించి నా దగ్గర మాట్లాడొద్దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
420 బ్యాచ్‌ను జనాలు తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయని.. బెల్లీ డ్యాన్స్‌లు, లుంగీ డ్యాన్స్‌లు టీడీపీ నేతలకే బాగా తెలుసునని అన్నారు. చంద్రబాబు చరిత్ర జూద గృహాలు, వ్యభిచారం నడుపుకోవడమేనని ఆరోపించారు. ప్రజల సర్టిఫికెట్ మాకు ముఖ్యమని.. చంద్రబాబు, ఆయన డబ్బా ఛానళ్ల సర్టిఫికెట్ మాకు అవసరం లేదని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు చరిత్ర బయట పెడతానని కొడాలి నాని అన్నారు.