చంద్రబాబుకు మాజీమంత్రి కొడాలి నాని సవాల్
Kodali Nani Fire On Chandrababu. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు.
By Medi Samrat Published on 21 Nov 2022 8:30 PM ISTమాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ నేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని ధ్వజమెత్తారు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే.. గుడ్డలూడదీసి కొడతానని చంద్రబాబు అంటున్నాడు.. 2024 ఎన్నికల తరువాత ఇదేం ఖర్మమా అని బాబు, లోకేష్ అనుకుంటారని జోస్యం చెప్పారు. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజలను టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. గుడివాడలో ఎవరికీ భయపడేది లేదని.. ఎంత మంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరని అన్నారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా.. నేను రెడీ అంటూ సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ నిలబెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన వ్యక్తి లోకేశ్. జగన్ రాజకీయాల్లో ఉన్నంతవరకు.. మంగళగిరిలోనే కాదు.. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా.. లోకేశ్‌ను ఓడిస్తాం. నిజంగానే లోకేశ్ మంగళగిరిలో గెలిచి.. పక్క నియోజకవర్గానికి వెళ్లి అక్కడి గెలిపిస్తాను అంటే నమ్ముతారు. కానీ.. తాను నిల్చున్న చోటే గెలవలేని లోకేశ్.. పక్కవారిని ఎలా గెలిపిస్తారు. పాదయాత్ర అంటే దానికి ఓ క్రెడిబులిటీ ఉంటది. వైఎస్సార్, జగన్ చేశారంటే దానికి అర్థం ఉంటది. కానీ.. లోకేశ్ పాదయాత్ర చేయడం ఏంటీ.. లోకేశ్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు.