కేటీఆర్ మాట మార్చడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన ఇదే..

JC Prabhakar Reddy Recats On KTR Comments. ఏపీ పరిస్థితిపై కొద్దిరోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి

By Medi Samrat  Published on  2 May 2022 11:35 AM GMT
కేటీఆర్ మాట మార్చడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన ఇదే..

ఏపీ పరిస్థితిపై కొద్దిరోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దుమారం రేపగా.. ఆ తర్వాత ట్విట్టర్ లో అందుకు సంబంధించిన వివరణ ఇచ్చారు. క్రెడాయ్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే బాధ కలిగించి ఉండొచ్చంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఎవరినో బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. ఏపీ సీఎం జగన్‌ ను సోదర సమానుడిగా భావిస్తున్నానని.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు.

ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ 'తమ్ముడూ.. కేటీఆర్. నీవు చెప్పింది కరెక్టే. నీ మాటలపై నిలబడి ఉండు' అని అన్నారు. టంగ్ స్లిప్ అయినట్టుగా మళ్లీ మాట మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు. ఉన్న మాట అంటే ఏమీ కాదని.. ఏపీలో కరెంటు లేదని, రోడ్లు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఏపీ పని అయిపోయిందని అన్నారు. రోడ్లు బాగోలేకపోవడంతో ఖరీదైన కార్లలో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోందని అన్నారు. కేటీఆర్ భయపడి కాకుండా, బాగుండదనే ఉద్దేశంతో మాట మార్చి ఉంటాడని చెప్పారు. భవిష్యత్తు నాయకుడు ధైర్యంగా ఉండాలంటూ కేటీఆర్ కు జేసీ సూచించారు. కేటీఆర్ నిజాలు చెప్పి మాట మారుస్తారెందుకు? మాట మీద నిలబడండి అని అన్నారు.










Next Story