జనసేనాని ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన

By Medi Samrat
Published on : 10 Oct 2023 6:30 PM IST

జనసేనాని ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దయింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు రేపటి సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. వైరల్ ఫీవర్ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన తెలిపింది. పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కూడా వెన్ను నొప్పితో బాధపడ్డారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు.

తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే అంశంపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురవ్వడంతో సమావేశం వాయిదా పడింది.

Next Story