దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: పవన్ కళ్యాణ్

Janasena Leader Pawan Kalyan Fire On AP Govt. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు

By Medi Samrat
Published on : 14 Feb 2023 8:00 PM IST

దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఒక అంధ యువతిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసు పహారాలో ఉండే సీఎం నివాసానికి సమీపంలోనే ఇంత దారుణం జరిగితే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. తన నివాసం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒక్కటేనని అన్నారు. ఈ హత్య ఘటనను శాంతిభద్రత వైఫల్యంగా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసుల పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తున్నా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందన్నారు. యేడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్నీ ఇప్పటికీ అరెస్టు చేయలేక పోయారంటే వైఫల్యం ఎవరిది అని ప్రశ్నించారు. దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.


Next Story