పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడితే కేసులే..!

Jana sena fumes rumours about Pawan Kalyan Marriage threatens legal action. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నోవా కొణిదెల గురించి అనేక మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి

By Medi Samrat  Published on  7 July 2023 8:30 PM IST
పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడితే కేసులే..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్నోవా కొణిదెల గురించి అనేక మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. అనవసరంగా ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్న వారిపై జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత కొన్ని వారాలుగా, ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ట్విట్టర్‌లోనూ, పలు సోషల్ మీడియా అకౌంట్ల లోనూ పోస్ట్‌లు షేర్ చేశారు.

పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల వైవాహిక జీవితంపై సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో తప్పుడు వార్తలు, వదంతులు వ్యాపించడాన్ని పార్టీ లీగల్ సెల్ గుర్తించిందని జనసేన సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కళ్యాణ్ అనుచరుల మదిలో విధ్వంసం సృష్టించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ టీమ్ హెచ్చరించింది. నిరాధారమైన ఇలాంటి పుకార్లను వ్యాపింపజేస్తున్న ఎన్నో సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించినట్లు తెలిపింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు అదే పనిగా పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నోవా ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. కొన్ని డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెల్స్, ఇతర మీడియా సంస్థలను కూడా తాము గుర్తించినట్లు తెలిపింది. పరువు నష్టానికి పాల్పడినవారందరిపై తాము కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. బేషరతు క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. రెచ్చగొట్టడం, పరువు నష్టం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్లు 153, 499, 500, 120 బీ రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పింది. మేము వివిధ డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్‌లు, మీమ్ పేజీలు, యూట్యూబ్ ఛానెల్‌లు, ఇతర మీడియా హౌస్‌లు కూడా అదే విధంగా తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నట్లు కనుగొన్నాము. రెచ్చగొట్టే, పరువు నష్టం కలిగించే ఈ చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది.


Next Story