బీఫామ్స్ అందించిన జనసేనాని.. ఒకరికి మాత్రం మిస్
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు.
By Medi Samrat Published on 17 April 2024 6:03 PM ISTమంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బీఫామ్స్ అందించారు. జనసేన పార్టీ అభ్యర్థులు 21అసెంబ్లీ స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మొత్తం పోటీలో ఉన్న అభ్యర్ధులలో ఒక్కరికి మినహా అందరికీ మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బీ ఫామ్స్ అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పాలకొండ నుంచి పోటీ చేస్తున్న జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.
జనసేన తరపున నెల్లిమర్లలలో లోకం మాధవి, నిడదవోలులో కందుల దుర్గేష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలిలో సుందరపు విజయ్‌కుమార్, పి.గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ, రాజోలులో దేవ వరప్రసాద్, తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరులో శ్రీధర్, అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, భీవరంలో పులివర్తి ఆంజనేయులు, నరసాపురంలో బొమ్మిడి నాయకర్, ఉంగటూరులో పత్సమట్ల ధర్మరాజు, పోలవరంలో చిర్రి బాలరాజు, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌లో పంతం నానాజీ, రాజానగరంలో బత్తుల రామకృష్ణ, తెనాలిలో నాదెండ్ల మనోహర్ లు పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు.