ఆ రెండు రాయ‌ల‌సీమ జిల్లాల‌కు అధ్యక్షుల‌ను నియమించిన జ‌గ‌న్‌

కర్నూలు జిల్లాకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు

By Medi Samrat  Published on  5 Sept 2024 9:45 PM IST
ఆ రెండు రాయ‌ల‌సీమ జిల్లాల‌కు అధ్యక్షుల‌ను నియమించిన జ‌గ‌న్‌

కర్నూలు జిల్లాకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి అధికారిక ప్రకటన వచ్చింది.

పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే నాయకులు కరువవ్వడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పలు జిల్లాలు, నియోజకవర్గాలకు చీఫ్ లను నియమించేశారు.

Next Story